సంతోషం సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Nagarjuna santhosham Movie :టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు మంచి హిట్ ఇచ్చిన సంతోషం మూవీ 2002మే2న రిలీజై, ఇంటిల్లపాదీని ఆకర్షించింది. సూపర్ హిట్ అయింది. నాగ్ కి ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చింది. అదే ఏడాది చిరంజీవి ఇంద్ర మూవీకి కూడా నంది రావడంతో నాగ్,చిరు కల్సి పంచుకున్నారు. కెఎల్ నారాయణ, కెమెరామెన్ ఎస్ గోపాలరెడ్డి కల్సి స్థాపించిన దుర్గా ఆర్ట్స్ పక్షాన ఎన్నో హిట్ మూవీస్ తీశారు. సంతోషం కూడా వీళ్ళు తీసిందే. అప్పటికే అసోసియేట్ డైరెక్టర్ కమ్ రైటర్ గా ఉన్న దశరధ్ ని నటుడు బెనర్జీ దుర్గా ఆర్ట్స్ దగ్గరకు తీసికెళ్ళాడు.

ఎందుకంటే వాళ్ళు మంచి కథ కోసం చూస్తున్నారు. దశరధ్ కథ విన్నాక ,నాగ్ దగ్గరకి పంపారు. కానీ యాక్షన్ సినిమా ఇప్పటికే చేస్తున్నాను,ఫ్యామిలీ స్టోరీ ఉంటె చెప్పమని నాగ్ అన్నాడు. దాంతో గోపిమోహన్ తో కల్సి దశరధ్ కూర్చున్నాడు. హిందీలో అజయ్ దేవగన్ చేసిన హమ్ దిల్ దే ఛుక్ సనమ్ తరహాలో కథ ఉండాలని ఆలోచించడంతో లైన్ దొరికింది. వారంలో కథ రెడీ. నాగ్ ఒకే. దాంతో స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. కానీ నాగ్ ఏమీ చెప్పలేదు.

నువ్వు నేను మూవీలో అసోసియేట్ గా గాజువాక పిల్లా సాంగ్ షూటింగ్ లో ఉండగా వెంటనే రమ్మని గోపాల్ రెడ్డి నుంచి కాల్. లంచ్ టైం లో చేసాడు. నాగ్ కి కథ ఒకే అని ఫోన్ లో గోపాలరెడ్డి చెప్పడంతో దశరధ్ ఫ్లాట్ అయ్యాడు. నాగ్ ఆగస్టునుంచి డేట్స్ ఇచ్చేసారు. నువ్వు డైరెక్ట్ చేయడానికి రెడీ అవ్వు అని గోపాలరెడ్డి చెప్పేసరికి ఓ పక్క ఆనందం,మరోపక్క ఆశ్చర్యంలో దశరధ్ ఉన్నాడు. కథ ఇస్తాను కానీ డైరెక్షన్ నావలన కాదు అని బెరుకుగా దశరధ్ చెప్పాడు. కానీ నాగ్ పట్టుబట్టడంతో నవంబర్ లో చేస్తా అని బదులివ్వడం ,నాగ్ ఒకే అనడం జరిగిపోయాయి. టైటిల్ సంతోషం కన్ఫర్మ్. ఇద్దరు హీరోయిన్స్ కోసం లగాన్ మూవీలో చేసిన గ్రేసీ ని తీసుకున్నారు. ఇష్టం మూవీలో చేసిన శ్రేయాను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.
Tollywood Hero Sunil
దశరధ్, సునీల్, ఆర్పీ పట్నాయక్, త్రివిక్రమ్, చంద్ర సిద్ధార్ధ్ లకు ఓ హోటల్ అడ్డాగా ఉండేది. అందరివీ బైక్ లు కాగా, చంద్ర సిద్ధార్ధ్ కి కారు ఉండేది. కారులో వెళ్తుంటే అందులో ఇంగ్లీషు పల్లవితో చంద్ర సిద్ధార్ధ్ ఓ పాట అందుకునే సరికి ఇందులోది అని ఆర్పీ అడిగాడు. నీ ట్యూన్ కి పాడాను అని చెప్పడంతో అతడితో ఇంగ్లీషు సాంగ్ రాయించాడు. ఇక సెకండాఫ్ లో ప్రభుదేవా ఎంటర్ అయ్యేలా ఒప్పించారు. కానీ క్లైమాక్స్ లో ఎక్కడో తేడా ఉందని,అందుకే త్రివిక్రమ్ దగ్గర చెప్పేసరికి టకాటకా డైలాగులు త్రివిక్రమ్ చెప్పేసాడు. దీంతో క్లైమాక్స్ అదిరింది అంటూ దశరధ్ లో ఆనందం. 2001నవంబర్ 15న మూవీ మొదటి షాట్ తీశారు.

ఇక గ్రేసీ ,నాగ్ ల మీద సాంగ్ షూట్ చేయాలి. కానీ పల్లవి విన్నాక కొరియోగ్రాఫర్ రాజు సుందరం నచ్చలేదన్నాడు. దాంతో రాత్రంతా కూర్చుని కులశేఖర్ కి ఫోన్ చేస్తే దొరకలేదు. దాంతో దశరధ్,ఆర్పీ కల్సి ‘దేవుడే దిగివచ్చిన’ పల్లవితో సాంగ్ రాసేశారు. రాజు సుందరం ఒకే చెప్పేసాడు. సునీల్ కి క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నా ఐడియా రావడంలేదు. దాంతో ప్రభుదేవాకు డాన్స్ నేర్పించినట్లు క్యారెక్టర్ గురించి సునీల్ అలవోకగా చెప్పడంతో అప్పటికప్పుడు సీన్ తీసేసారు. సినిమా రిలీజవ్వడం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కంగ్రాట్స్ అని చెప్పడంతో దశరధ్ లో ఆనందం. మొత్తానికి ఈ మూవీ నాగ్ లో సంతోషం నింపింది.