ఇలా చేస్తే 7 రోజుల్లో ఎంతటి భారీ పొట్ట అయినా,తొడల దగ్గర కొవ్వు అయినా సులభంగా కరిగిపోతుంది
Weight loss Drink : ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ప్రధానమైనది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందువల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.
ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగుతూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే చాలా తొందరగా బరువు తగ్గవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ కలోంజి గింజలు, అంగుళం అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన ఈ నీటిని గ్లాసు లోకి వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా రోజు తాగుతూ ఉంటే క్రమంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కలోంజి గింజలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చాలా వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగ మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అల్లంలో షోగోల్స్, జింజెరాల్స్ అనే సమ్మేళనాలు ఉండుట వలన తీసుకున్న ఆహారం కొవ్వుగ మారకుండా శక్తిగా మారుతుంది.
తేనెలో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. ఇది ఒకేసారి శరీరంలో కలిసిపోకుండా నిదానంగా కలుస్తుంది. దాని వల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది. ఈ డ్రింక్ ని ఉదయం పరగడుపున తాగవచ్చు. లేదా బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు తాగవచ్చు. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.