Healthhealth tips in telugu

5 రూపాయిల ఖర్చుతో కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అన్ని మాయం

Joint Pains Home Remedies in telugu:ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, Joint Pains, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఈ రెమిడీ ఫాలో అయితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ రెమిడిని సమస్యలు ఉన్న వారే కాకుండా నార్మల్ గా ఉన్న వారు కూడా తీసుకుంటే భవిష్యత్తులో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
Lotus Seeds benefits In Telugu
ఈ చిట్కా కోసం Lotus Seeds తీసుకుంటున్నాం. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి అరకప్పు బెల్లం వేసి కలిపితే కరిగి పాకం వస్తుంది. దీనిలో రెండు కప్పుల Lotus Seeds వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి. వీటిని నిల్వ చేసుకుంటే దాదాపుగా పది రోజులు నిల్వ ఉంటాయి. వీటిని రోజుకి పది తింటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు.
Jaggery Health Benefits in Telugu
వీటిలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సాయంత్రం సమయంలో తింటే ఒత్తిడి లేకుండా మంచి నిద్ర పడుతుంది.
Joint Pains
మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. అలాంటి వారికీ మంచి ఆహారం అని చెప్పవచ్చు. 30 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.