ఇలా చేస్తే చాలు నిమిషంలో నోటి దుర్వాసన మాయం అవుతుంది…జీవితంలో ఉండదు
Tips for bad breath :చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన (bad breath) సమస్య ఉందంటే నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలన్న ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఉదయం సమయంలో చాలా మంది బ్రష్ చేయకుండానే కాఫీ,టీ తాగేస్తూ ఉంటారు.
అలా అసలు చేయకూడదు. అలా చేస్తే నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. నోటి శుభ్రత లేకపోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా వస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఈ విధంగా రోజులో రెండు లేదా మూడు సార్లు చేయాలి.
అలాగే బయటకు వెళ్ళే ముందు కూడా ఇలా చేస్తే నోటి దుర్వాసన(bad breath) ఉండదు. మరో చిట్కా తెలుసుకుందాం. మసాలా దినుసుగా ఉపయోగించే లవంగాలు నోటి దుర్వాసన తొలగించటానికి బాగా సహాయపడుతుంది. రెండు లవంగాలను నములుతూ ఆ రసాన్ని మింగాలి. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలో బ్యాక్టీరియా తొలగిపోయేలా చేస్తుంది.
నోటి దుర్వాసన(bad breath) తగ్గటమే కాకుండా చిగుళ్ళ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తస్రావం, దంత క్షయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ఈ రెండు చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.