కేవలం 2 నిమిషాల్లో శరీరంలో వేడిని, నీరసం,నిసత్తువను తగ్గించే అద్భుతమైన డ్రింక్

Summer drink In telugu :వేసవికాలం వచ్చేసింది. ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ఎండల వేడి నుండి తప్పించుకోవటానికి అందరు కూల్ డ్రింక్స్ త్రాగుతూ ఉంటారు. ఈ ఎండల వేడి నుండి బయట పడటానికి మరియు శరీరంలో వేడి తగ్గటానికి ఇలా కూల్ డ్రింక్స్ తాగటం వలన ఉపయోగం కన్నా అపాయమే ఎక్కువగా ఉంటుంది.
sabja seeds benefits
అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఒక అద్భుతమైన డ్రింక్ తాగితే శరీరంలో వేడి చాలా తొందరగా తగ్గటమే కాకుండా నీరసం,నిసత్తువ వంటివి తొలగిపోతాయి. ఈ డ్రింక్ ని సబ్జా గింజలతో తయారుచేస్తున్నాం. ఒకప్పుడు వేడి చేసిందంటే సబ్జా గింజల పానీయాన్ని త్రాగేవారు. ఇప్పుడు చాలా మందికి సబ్జా గింజలంటే తెలియదు.

శరీరంలో వేడి తగ్గించటానికి సబ్జా గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ డ్రింక్ పేరు సబ్జా లెమన్ డ్రింక్. ఈ డ్రింక్ తయారుచేయడానికి కేవలం నాలుగు ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి.
Patika Bellam Cold And Cough
సబ్జా గింజలు – 2 స్పూన్స్
kallu uppu లేదా నల్ల ఉప్పు – పావు స్పూన్
పటికబెల్లం లేదా పంచదార – 3 స్పూన్స్
నిమ్మకాయ – 1
lemon benefits
తయారి విధానం
ముందుగా సబ్జా గింజలను అరగంట పాటు నానబెట్టాలి. ఒక పెద్ద బౌల్ లో రెండు కప్పుల నీటిని తీసుకోని దానిలో మూడు స్పూన్ల పంచదార, పావు స్పూన్ kallu uppu వేసి బాగా కలపాలి. దీనిలో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను కలపాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని కలపాలి. అంతే సబ్జా లెమన్ డ్రింక్ రెడీ. గ్లాసులో పోసి సర్వ్ చేసుకోవటమే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.