Healthhealth tips in telugu

ఎన్నో ఔషధ గుణాలు ఉన్నఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి… ఎందుకంటే…

Nela Usiri Benefits In telugu :ఇప్పుడు చెప్పే ఈ మొక్క పేరు నేలఉసిరి. ఉసిరి మొక్క కాదు. నేలఉసిరి మొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నేల ఉసిరి ఆకులు ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి సహాయపడతాయి. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే ఆ మొక్కల గురించి మనకు తెలియక పిచ్చి మొక్కలు అని భావిస్తాము.
nela usiri
కానీ ఆ మొక్కల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఇక నేలఉసిరి ఆకుల్లో ఉన్న ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ఆకులు యాంటీబయటిక్ గా పనిచేస్తాయి. గాయాలైనప్పుడు ఈ ఆకుల పేస్టు రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకులను పేస్ట్ చేసి దానిలో ఉప్పు కలిపి కట్టుకడితే విరిగిన ఎముకలు సైతం అతుక్కుంటాయి. .
Diabetes diet in telugu
అంతేకాకుండా చర్మ వ్యాధులు నయం చేసే శక్తి కూడా ఉంది. దగ్గు,ఆయాసం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే ఆకలి లేని వారిలో ఆకలిని పుట్టిస్తుంది. ఉసిరి మనకు ఎంత మేలు చేస్తుందో నేల ఉసిరి కూడా అంతే మేలు చేస్తుంది. ఒక రకంగా న్యాచురల్ మెడిసిన్ గా చెప్పవచ్చు. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు.

కామెర్ల సమస్య ఉన్నవారు ఉదయం సాయంత్రం ఈ ఆకుల కషాయం తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. కామెర్లు ఉన్నవారు ఈ మొక్క వేర్లను తెచ్చుకుని రోట్లో వేసి మొత్తగా నూరగా వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకుని ఉదయం సాయంత్రం తాగితే కామెర్లు వెంటన తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.