చెప్పులు లేకుండా నడిస్తే శారీరక నొప్పులు తగ్గటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది…నిజం ఎంత?
walking without footwear : రోజుకి కనీసం పదిహేను నిమిషాలు నడిస్తే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే మనలో చాలా మంది బిజీ జీవనశైలి కారణంగా. నడకకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కొంతమంది ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేసినప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
చెప్పులు లేకుండా నడవడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి చూపు మెరుగుపడి కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది.ఈ మధ్య కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
చెప్పులు లేకుండా నడవడం వలన శరీరం రిలాక్స్ అయ్యి తొందరగా నిద్ర పడుతుంది. ఆ విధంగా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వలన పాదాలకు మసాజ్ అయ్యి పాదాల నొప్పులు తగ్గడమే కాకుండా శారీరక నొప్పులు కూడా తగ్గుతాయి. ఫ్లోర్ కు పాదాలు ఎక్కువ అటాచ్ అవ్వడం వల్ల బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో నాడీవ్యవస్థ మరింత చురుకుగా పనిచేస్తుంది.
మన మెదడుపై ప్రభావం పడుతుంది. ఇది మెడదు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు ఆలోచనా విధానం కూడా మెరుగుపడుతుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల క్రింది భాగంలో నాడులను క్రమబద్దం చేసి, బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడవడం వల్ల కాళ్ళల్లో, పాదాల్లో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జాయింట్స్ లో నొప్పి, వాపులను తగ్గిస్తుంది. వెరీకోస్ వీన్స్ ను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/