వీటిని ఇలా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
How To Lose Belly Fat : అధిక బరువు,శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే మనం జాగ్రత్తలు పాటించాలి. బిజీ జీవనశైలిలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం కూడా జరగటం లేదు.
శరీరంలో కొవ్వును కరిగించే ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. అవి మనకు వంటింటిలో అందుబాటులోనే ఉంటాయి. కాస్త శ్రద్ద పెట్టి అలాంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మంచిది. ప్రతి రోజు వంటల్లో వాడే కరివేపాకు శరీరంలో వ్యర్ధాలను, కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు 5 కరివేపాకు ఆకులను పరగడుపున నమిలితే చాలు.
అల్లం కూడా శరీరంలో కొవ్వును కరిగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్లంలో జింజెరోల్స్ మరియు షోగోల్స్ అనే సమ్మేళనాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ప్రతి రోజు అంగుళం అల్లం ముక్కను తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకు,అల్లం కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 5 లేదా 6 కరివేపాకు ఆకులు,అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి పది నిమిషాలు మరిగిస్తే కరివేపాకు,అల్లంలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిని 15 రోజుల పాటు తాగితే కొవ్వు కరగటం ప్రారంభం అవుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.