రోజు తింటే శారీరక బలహీనత,నీరసం,నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు అసలు ఉండవు
Ground Nut and Flax seeds Laddu : ఈ మధ్య మారిన జీవనశైలి పరిస్థితులు మరియు మారిన ఆహారపు అలవాట్లు,పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుండి బయట పడాలంటే ఇప్పుడు చెప్పే లడ్డును ప్రతి రోజు తినాలి.
కప్పున్నర వేరుశనగ గుళ్లను వేగించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అరకప్పు అవిసె గింజలు,పావుకప్పు తెల్లనువ్వులు వేగించి మిక్సీ జార్ లో వేసి రఫ్ గా మిక్సీ చేయాలి. పాన్ లో కప్పున్నర బెల్లంను వేసి నీటిని పోసి పాకం పట్టాలి. పాకం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి.
ఈ పాకంలో మిక్సీ చేసిన అవిసె గింజలు,తెల్లనువ్వుల పొడి మరియు వేరుశనగ గుళ్ళు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటూ ఉంటే శారీరక బలహీనత,నీరసం,నొప్పులు, రక్తహీనత వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ లడ్డూలు దాదాపుగా పది రోజుల పాటు నిల్వ ఉంటాయి.
వీటిని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. కాస్త సమయాన్ని కేటాయించి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తయారుచేసుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ లడ్డును చేయటం చాలా సులువు. దీనిలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి మీరు ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.