Jaggery water:ప్రతి రోజు పరగడుపున బెల్లం నీళ్ళు తాగితే ఊహించని ప్రయోజనాలు
Jaggery water benefits:ఉదయం సమయంలో పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క కలిపి తాగితే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లంలో కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. ఈ సీజన్లో బెల్లం నీటిని తాగితే డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేసి శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
ఉదయం సమయంలో తీసుకోవటం వలన అలసట,నీరసం లేకుండా తక్షణ శక్తి లభిస్తుంది. ఎముకలు బలహీనంగా,పెళుసుగా మారకుండా ఆరోగ్యంగా ఉండేలా సెహ్సి కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ చలికాలంలో నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. పొటాషియం మరియు సోడియం ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
దీనిలో ఐరన్, ఫోలేట్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహినత సమస్య రాకుండా చేయటమే కాకుండా…రక్త హీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. బెల్లంలో శరీరాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. ఇది సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి సహాయపడుతుంది. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి బెల్లం నీరు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. బెల్లంలో మెగ్నీషియం, విటమిన్ B1, B6 మరియు C, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News