Healthhealth tips in telugu

Eating Spinach : మతిమరుపు తోపాటు, బ్రెయిన్ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే?

Eating Spinach : వయస్సు పెరిగే కొద్ది ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కొన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవలసిన అవసరం ఉంది. మిగిలిన కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ప్లేవనాయిడ్స్‌ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తుంది.

పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్లుగా పని చేస్తాయి.పాలకూరలో లభించే విటమిన్‌ సి, ఏ లు, మెగ్నీషియం, ఫోలిక్‌యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌క్యాన్సర్‌ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా కాల్షియం, సోడియం, క్లోరిన్‌, ఫాస్పరస్‌, ఇనుము, ఖని జ లవణాలు, ప్రొటిన్లు, విటమి న్‌ ఏ, విటమిన్‌ సీ ఉన్నాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడైంది. పాలకూరలో శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండుట వలన రక్తహీనతను తగ్గిస్తుంది.

రోగ నిరోధకశక్తిని కూడా పెంచుతుంది.జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్ర్తీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్‌ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News