Healthhealth tips in telugu

Weight loss Tips: వేగంగా బరువు తగ్గించుకోవాలంటే..ఈ టీ నెలరోజులు తాగితే చాలు

Weight Loss Tea: ఈ మధ్య కాలంలో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

అధిక బరువుతో బాధ పడేవారు కడుపు మాడ్చుకొని ఉపవాసాలు ఉండకుండా స్లిమ్మింగ్ టీ ని ట్రై చేయవచ్చు. గ్రీన్ టీ,వైట్ టీ ,బ్లాక్ టీ వంటి చైనీస్ టీలను స్లిమ్మింగ్ టీ అని అంటారు. వీటి రుచి ఇష్టపడని వారు రెండు రకాల టీ లను కలిపి తీసుకోవచ్చు. అయితే రెండు టీ లను కలిపి తీసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి.

స్లిమ్మింగ్ టీ వలన అనేక లాభాలు ఉన్నాయి. శరీర ప్రక్రియనురెట్టింపు చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ స్థాయిలను క్రమపరుస్తుంది. ఒత్తిడి,ఆందోళనను తగ్గిస్తుంది. రోగనిరోదకత పెరుగుతుంది. హానికరమైన టాక్సిన్ లను బయటకు పంపించటానికి సహాయ పడుతుంది.

దీన్ని క్రమం తప్పకుండా త్రాగితే కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ టీ లను కొనుగోలు చేసేటప్పుడు వాటిలో మిళితం అయిన పదార్దాల గురించి తప్పనిసరిగా తీసుకోవాలి. స్లిమ్మింగ్ టీ వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గర్భిణి స్త్రీలు, వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ త్రాగాలని అనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

తొందరగా బరువు తగ్గాలని స్లిమ్మింగ్ టీ ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. రోజుకి ఒకటి,రెండు కప్పుల టీ ని మాత్రమే త్రాగాలి. ఈ టీ ఆహారానికి ప్రత్యామ్నాయం మాత్రం కాదు. తగినంత పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే కొంత వ్యాయామం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News