Healthhealth tips in telugu

Salt Water:ఉప్పు నీటిని తాగుతున్నారా.. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు..

Salt water health beenfits in telugu:స్టాల్ వాటర్ అంటే ఏంటి… సోడియం, క్లోరైడ్ కలిసిన ద్రవం. సోడియం అనేది మనకు అత్యవసరమైన ఖనిజం. ఇది మన శరీరంలో ద్రవాలు సమంగా ఉండేలా చేస్తుంది. కండరాలు, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేసేలా చేస్తుంది. కడుపు నొప్పి వస్తుందంటే ఉప్పు కలిపినా నీటిని తాగమని చెప్పుతూ ఉంటారు.

ఆలా తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఉప్పు నీటిని తాగటం వలన లాభాలు ఉన్నాయి. నష్టాలు ఉన్నాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఉప్పు నీటిని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌, పేగులు, పెద్ద పేగు వంటివి శుభ్రం అవుతాయి. అయితే ఉప్పు ఎక్కువ‌గా వాడితే ర‌క్త‌పోటు, ర‌క్త ప్ర‌వాహాన్ని కంట్రోల్ దాటిపోయి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

చిగుళ్ల సమస్యలు,పంటి నొప్పి ఉన్నప్పుడు ఉప్పు నీటిని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఉప్పు నీరు బ్యాక్టీరియాను చంపుతుంది. ఎండలో ఎక్కువగా పనిచేసినప్పుడు చెమట రూపంలో ఉప్పు బయటకు పోతుంది. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అలాంటి సమయంలో ఉప్పు నీటిలో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగితే శ‌రీరం మ‌ళ్లీ హైడ్రేటింగ్‌కు వ‌స్తుంది.

ఉప్పు నీటిలో పది నిమిషాల పాటు అరికాళ్లను ఉంచాలి. ఇలా చేస్తే పాదాల సమస్యలు తగ్గడమే కాకుండా.. ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే వాటిల్లో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఏదైనా అతిగా తీసుకుంటే అనర్ధమే కదా.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.