Beauty Tips

Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది

Almond Face Glow Tips:ముఖం మీద నల్లని మచ్చలు, ముడతలు అనేవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. ఇలా కనిపించడం వల్ల ముఖం కళావిహీనంగా కనబడుతుంది. దాంతో మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ని వాడేస్తూ ఉంటారు. వాటి కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవనశైలిలో మార్పులు, వాతావరణంలో కాలుష్యం, చర్మం మీద శ్రద్ధ పెట్టకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మీద నల్లని మచ్చలు, ముడతలు ఏర్పడుతూ ఉంటాయి.

ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా సమస్యల నుంచి బయటపడవచ్చు. రాత్రి సమయంలో ఆరు బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన బాదం పప్పుల పై తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా పండిన ఒక అరటి పండును ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి.

ఆ తర్వాత తొక్క తీసిన బాదంపప్పులు వేయాలి. ఆ తర్వాత ఎనిమిది ఎండు ద్రాక్షలు, అరకప్పు పచ్చిపాలు పోసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్టులో అర స్పూన్ పసుపు, అర స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే నల్లని మచ్చలు, ముడతలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మృదువుగా మారుతుంది. అలాగే అందంగా ఉండాలంటే బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.