Kitchenvantalu

Gongura Egg Curry:ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కోడిగుడ్ల కర్రీ.. ఒకసారి ట్రై చేయండి

Gongura Egg Curry:.గోంగుర ఎగ్ కర్రీ.. ఉడికించిన గుడ్లను గోంగురా కాంబినేషన్లో చేస్తే పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీ గా టేస్ట్ అదిరిపోతుంది. మళ్లి మళ్లి తినాలనిపించే గోంగురా కోడిగుడ్ల కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు – 6
గోంగుర ఆకులు – 1 కట్ట
నూనె – 2 టేబుల్ స్పన్స్
హోల్ గరం మసాలా – తగినంత
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 4
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
టమాటోలు – 2
కారం – ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా శుభ్రంగా కడిగిన గోంగుర ఆకులను ఐదారు నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి.
2.చల్లారిన తర్వాత మిక్సిజార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి.
3.స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి ఉడికించిన గుడ్లను వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు అదే బాండీలో మూడు యాలకులు,నాలుగు లవంగాలు, మూడు ఇంచుల దాల్చినచెక్క ,1/2 టీ స్పూన్ షాజీరా ,జీలకర్ర వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
5.గరం మసాల దినుసులు వేగాక అందులోకి ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి.

6.మగ్గిన ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి ,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్,టమాటో ముక్కలు వేసి కలుపుకోని మూత పెట్టి ఉడికించాలి.
7.టమాటోలు మెత్తపడ్డాక కారం,ధనియాలపొడి ,జీలకర్ర పొడి,ఉప్పు వేసి కలుపుకోవాలి.
8.కారం వేగాక అందులోకి ½ కప్పు నీళ్లను పోసి 2 టేబుల్ స్పూన్స్ గోంగుర పేస్ట్ యాడ్ చేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
9.గ్రేవి చిక్కపడ్డాక అందులోకి వేపుకున్న గుడ్లను వేసి మూతపెట్టుకోని ఏడు ,ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.
10.చివరగా కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే.