Health Tips:చిటికెడు పొడి తీసుకుంటే అధిక బరువు,గ్యాస్,కొలెస్ట్రాల్,డయాబెటిస్ జీవితంలో ఉండవు
Sonti Podi health benefits In Telugu : ఘాటైన రుచి ప్రత్యేకమైన సువాసన కలిగి వున్న శొంఠి పొడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శొంఠి పొడి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. శొంఠి పొడి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. శొంఠి కొమ్ములను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యి లేదా నూనెలో వేగించాలి.
100 గ్రాముల శొంఠికి సుమారుగా ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి సరిపోతుంది. బాగా వేగిన శొంఠి కొమ్ములను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.ఈ పొడిని ప్రతి రోజు అరస్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పొడిని అన్నంలో మొదటి ముద్దగా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి తాగవచ్చు
శొంఠి పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు,జెంజెరాల్,షాగొల్ ఉంటాయి. అధిక బరువు సమస్య ఉన్న వారికి,డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. వీరు ఉదయం సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పొడి వేసుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.
గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. .
గ్యాస్ సమస్య ఉన్నవారు భోజనంలో మొదటి ముద్ద శొంఠి పొడి కలుపుకుని తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. శొంఠి జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటం ద్వారా బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే శొంఠి పొడి ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది.
అంతేకాక చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది ముఖ్యంగా కీళ్ళు , వేళ్ళలో వాపును తగ్గిస్తుంది. గాయాల వల్ల కలిగే వాపు నుంచి ఉపశమనం కలిగించటంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.