Acidity Home Remedies:1 స్పూన్ భయంకరమైన గ్యాస్,ఎసిడిటీ,చేతులు,కాళ్లలో తిమ్మిర్లు అన్నింటిని తగ్గిస్తుంది
Acidity Home Remedies In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా అలాగే సరైన సమయంలో భోజనం చేయక పోవటం,మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వంటి కారణాలతో గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించు కోవటానికి వంటింటిలో ఉన్న 3 వస్తువులను ఉపయోగించి డ్రింక్ తయారుచేసుకుందాం.
రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర,ఒక స్పూన్ సొంపు,అర స్పూన్ ధనియాలను వేసి నానబెట్టాలి. ఇలా నానబెట్టటం వలన వాటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
ఇలా తాగటం వలన గ్యాస్,మలబద్దకం,ఎసిడిటీ, తిమ్మిర్లు వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. సొంపు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. జీలకర్ర జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వునుకూడా కరిగిస్తుంది. ఇక ధనియాలు శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
అలాగే యూరినరీ ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి మరియు ధైరాయిడ్ సమస్య ఉన్న వారికి నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ని పరగడుపున తీసుకోవటం గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా చేతులు,కాళ్ళ తిమ్మిర్లు తగ్గుతాయి. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.