Egg Paratha:ఇది ప్రోటీన్లతో నిండిన బ్రేక్‌ఫాస్ట్.. రుచి చూస్తే వదిలిపెట్టరు
Egg Paratha:ఎగ్ పరాటా.. ఎన్ని వెరైటీస్ చేసి,ఎగ్ వెరైటీస్ అంటేనే ఎక్కువ ఇష్టపడ్తుంటారు పిల్లలు.బ్రేక్ ఫాస్ట్ కి,లంచ్ బాక్స్ లోకి ఎగ్ పరాటా చేసి పెట్టారంటే హెల్తీ ఫుడ్ మీ పిల్లలకి అందించినట్టే.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 2 కప్పు
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
టోమాటోస్ – 2
మిర్యాల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
వాము – చిటికెడు
గుడ్లు – 5
తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండిని వేసి చిటికెడు ఉప్పు,వాము ,ఒక గుడ్డు సొన వేసి మిక్స్ చేసుకోవాలి.
2.కొద్ది కొద్దిగా నీళ్లను కలుపుతూ పిండిని ముద్దగా కలుపుకోవాలి.
3.రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకోని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4.వేరొక గిన్నెలో నాలుగు గుడ్లను పగలుకొట్టి బీట్ చేసుకోవాలి.
5.అందులోకి ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి తరుగు,కరివేపాకు,టమాటో తరుగు ,పెప్పర్ పౌడర్ ,కొద్దిగా ఉప్పు వేసి మిక్సి చేసుకోవాలి.
6.ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలోంచి కొద్దిగా తీసుకోని చపాతి కా ల్చుకోవాలి.
7.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడెక్కాక చపాతి వేసి లోఫ్లేమ్ పై కాల్చుకోవాలి.
8.కొద్దిగా వేగాక ఇప్పుడు చపాతి పై తయారు చేసుకున్న ఎగ్ మిక్స్ ని వేసి చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి.
9.ఒక వైపు కాలాక చపాతిని మరోవైపు తిప్పుకోని కాల్చుకోవాలి.
10.లో ఫ్లేమ్ లో గుడ్డు కూడ ఉడికించాలి.కొద్దిగా ఆయిల్ వేసుకోని రెండు నిమిషాల పాగు కాల్చుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి.
11.అంతే ఎగ్ పరాటా రెడీ.