Cabbage Nilva Pachadi:క్యాబేజీ నిల్వ పచ్చడి పక్కా కొలతల్లో ఇలా చేయండి రుచి అదిరిపోతోంది
Cabbage Nilva Pachadi:క్యాబేజి నిల్వ పచ్చడి..ఎప్పుడు మామిడి,నిమ్మ,టమాట పచ్చల్లే కాదు అప్పుడప్పుడు కాస్తా కొత్తగా ట్రై చేయాలి. క్యాబేజి తో నిల్వ పచ్చడి చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
క్యాబేజి – 1 kg
కారం – ½ కప్పు
ఉప్పు – ½ కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3-4 టీ స్పూన్స్
నిమ్మకాయలు – 7
జీలకర్ర మెంతుల పొడి – 1 టీ స్పూన్
ఆవాల పొడి – 2 టీ స్పూన్స్
తాలింపు గింజలు – 1 టీ స్పూన్
నూనె- 200 ml
తయారీ విధానం
1.క్యాబేజిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ లో 200 ml నూనె ను వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేసి వేపుకోవాలి.
3.ఎండు మిర్చి ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోని తాలింపు చల్లారనివ్వాలి.
4.ఇప్పుడు కారం,ఉప్పు,ఆవాలపొడి,జీలకర్రపొడి,నిమ్మరసం వేసి కలపాలి.
5.అందులోకి కట్ చేసుకున్న క్యాబేజి ముక్కలను వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
6.ఒక రోజు తర్వాత పచ్చడి నూనె పైకి తేలి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది