Healthhealth tips in telugu

jowar flakes:ఈ అటుకులను ఎప్పుడైనా తిన్నారా…ఇలా తింటే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు

jowar flakes weight Loss benefits : జొన్నలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలామందికి తెలుసు. అయితే మనలో చాలామంది జొన్నలను పిండిగాను., రవ్వగాను మాత్రమే చూసి ఉంటారు. అలా కాకుండా జొన్నలను అటుకులుగా కూడా తయారు చేస్తారు.

జొన్న అటుకులను తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ మధ్య కాలంలో జొన్న అటుకులు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి. జొన్న అటుకులను ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి. చాలా తొందరగా బయటపడవచ్చు. జొన్న అటుకులు Online స్టోర్స్ లోనూ, సూపర్ మార్కెట్లను చాలా విరివిగా లభ్యమవుతున్నాయి. .

అలాగే అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. ఒక బౌల్ లో ఒక కప్పు పెరుగు, ఐదు టేబుల్ స్పూన్ల జొన్న అటుకులు వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకుని తొక్క తీసి క్యారెట్ తురమాలి. పాన్ పెట్టి రెండు స్పూన్ల నువ్వుల నూనె వేసి కాస్త వేడెక్కాక పావు స్పూన్ ఆవాలు వేయాలి.

ఆ తర్వాత పావు స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, రెండు ఎండుమిర్చి, రెండు స్పూన్ల వేరుశెనగ గింజలు, అర స్పూన్ అల్లం తరుగు, రెండు రెబ్బల కరివేపాకు వేసి బాగా వేగించాలి. బాగా వేగిన ఈ మిశ్రమాన్ని పెరుగులో నానబెట్టిన జొన్న అటుకుల్లో కలపాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము రెండు లేదా మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి.

ఈ రెసిపీని ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో లేదా లంచ్ సమయంలో తీసుకుంటే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జొన్న అటుకులను ఇలా తీసుకోవడం వలన ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా ఈ జొన్న అటుకులను ఈ విధంగా తీసుకుంటే నీరసం, అలసట వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.