Healthhealth tips in telugu

Cashew Milk Benefits :రాత్రి పడుకొనే ముందు జీడిపప్పు పాలను తాగితే అద్భుతమైన ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Cashew Milk Benefits In Telugu : జీడిపప్పు తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మనలో చాలామంది జీడిపప్పును అలా తినేస్తూ ఉంటారు. అలా కాకుండా జీడిపప్పు పాలను తయారు చేసుకుని రాత్రి సమయంలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

జీడిపప్పులో ప్రోటీన్, సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక బౌల్ లో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేసి కొంచెం పాలను పోసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి.

పాలల్లో నానిన జీడిపప్పును మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి దానిలో జీడిపప్పు పేస్ట్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత అర స్పూను ఆర్గానిక్ బెల్లం వేసి ఒక నిమిషం మరిగించి గ్లాస్ లో పోసి రాత్రి పడుకునే ముందు తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకుంటే మంచిది.

ఈ పాలను తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. ఈ మధ్యకాలంలో మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సరైన నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. జీడిపప్పులో ఉండే పోషకాలు నిద్ర బాగా పట్టడానికి సహాయపడతాయి. .ఈ విధంగా కొన్ని రోజులపాటు తీసుకుంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.

అలాగే జీడిపప్పు పాలను తీసుకోవడం వలన శారీర అలసట., బలహీనత వంటివి ఏమీ ఉండవు. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తొలగిస్తుంది. ఈ పాలల్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో శక్తి నిర్వహణకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.