Crispy Bhindi Kurkure:ఇలా వేపితే చిప్స్ కంటే బెస్ట్ గా ఉంటాయి… బెండకాయ కుర్ కురే…రుచి సూపర్
Crispy Bhindi Kurkure Recipe:బెండకాయ జిగురుగా ఉంటుందని మనలో చాలా మంది తినటానికి ఇష్టపడరు. మనలో చాలా మంది ఎక్కువగా బెండకాయతో వేపుడు చేసుకుంటారు. వేపుడు కాకుండా ఇప్పుడు చెప్పే కరకరలాడే బెండకాయ Kurkure ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువగా హోటల్స్ లో దాల్ రైస్ తో అందిస్తారు. ఇది ఉత్తర భారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది.
కావలసిన పదార్థాలు
400 గ్రాముల బెండకాయలు, ముప్పావు కప్పు శెనగపిండి, పావు స్పూను జీలకర్ర, మూడు స్పూన్ల బియ్యప్పిండి, ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ చాట్ మసాలా, నూనె వేగించడానికి,రెండు స్పూన్ల నీరు.
తయారీ విధానం
బెండకాయలను రెండు చివరలు కట్ చేసి పొడవుగా చీల్చి దాని నుంచి విత్తనాలు తీసేసి నాలుగు భాగాలుగా చేయాలి. వాటిని రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో సెనగపిండి, గరం మసాలా, కారం,జీలకర్ర, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ ముక్కలను నూనెలో వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు వేయించాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా మారేవరకు వేయించాలి.