Cockroach:వంటగదిలో బొద్దింకల సమస్యా.. ఈ సింపుల్ టిప్స్ తో వాటికి చెక్ పెట్టేయోచ్చు..
Cockroach Remove Tips: కిచెన్ లు, బాత్రూమ్ లలో కొన్నిసార్లు కుప్పలుగా బొద్దింకలు కన్పిస్తుంటాయి. వీటిని వదిలించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. వంటగది శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది.
మన ఆరోగ్యం బాగుండాలని అనుకున్నప్పుడు వంటగది తప్పనిసరిగా శుభ్రంగా ఉండాలి. వంటగదిలో సింక్ దగ్గర ఎక్కువగా బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. బొద్దింకలు వచ్చాయంటే త్వరగా పోవు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి.
బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
వంటింట్లో బొద్దింకలు మాయమవ్వాలంటే బోరిక్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు.వంటింటి మూలల్లో బోరిక్ పౌడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి.
బేకింగ్ సోడా,చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News