Beauty TipsHealthhealth tips in telugu

Skin Care Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం

Wrinkles remove Home Remedies In Telugu :ఆఫీస్ లో కూర్చొని పనిచేసే వారి కంటే….బయట తిరిగి పనిచేసే వారికి ముప్పై లలోనే చర్మం మీద గీతలు పడటం, ముడతలు,చర్మం పొడి బారటం వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇటువంటి సమస్యలకు మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటిలో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో పరిష్కారం కనుక్కోవటం ఉత్తమం.

బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి ముఖానికి పట్టించాలి. అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చాక ఈ విధంగా చేస్తే ముఖం మీద గీతలు పడే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ముఖం మీద నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి.
pineapple
అనాస గుజ్జు కూడా ముఖం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. అనాస గుజ్జు లేదా రసంను తీసుకోని ముఖానికి,మెడకు రాసుకొని మర్దన చేసుకొని పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు,గీతలు రావు.

ఒక స్పూన్ ఆలివ్ నూనెకు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్నా మంచి పలితం కనపడుతుంది. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది.

బొప్పాయి గుజ్జుకు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.