Salty Rice Balls:ఎంతో రుచికరమైన నోరూరించే బియ్యం పిండి Balls ఎలా చెయ్యాలో తెలుసా?
Salty Rice Balls:ఎంతో రుచికరమైన నోరూరించే బియ్యం పిండి Balls ఎలా చెయ్యాలో తెలుసా.. బియ్యపు పిండితో ఉప్పు ఉండలు..ఈరోజుల్లో ఈవినింగ్ స్నాక్స్ అనగానే,పిల్లలకు చిప్స్ లాంటివి, జంక్ ఫుడ్స్,స్ట్రీట్ ఫుడ్స్, ఏవో అలవాటు చేస్తుంటారు.
కాని ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోనే,పిల్లలు ఇష్టపడేలా ,ఎన్నో స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు.అలాంటి స్నాక్ ఐటెమ్.బియ్యపు పిండితో ఉప్పు ఉండలు,ఎలా చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1.5 కప్పు
పుల్లని మజ్జిగ – తగినంత
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
కరివేపాకు – 2 రెమ్మలు
జీలకర్ర – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2
తరిగిన పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్
పచ్చికొబ్బరి – 1/3 కప్పు
తయారీ విధానం
1.ఇప్పుడు ఒక గిన్నెలోకి, బియ్యాన్ని వేసుకుని బాగా కడిగి,5 గంటల పాటు నానపెట్టి, వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
2. స్టవ్ పై ఒక పాన్ పెట్టి, ఆయిల్ వేసుకుని, అందులోకి తాళింపు కోసం, జీలకర్ర, ఆవాలు, చిటపటలాడుతుండగా, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి.
3. అందులోకి తరిగిన పచ్చిమిర్చి,ఎండుమిర్చి, వేసుకుని మీడియం ఫ్లేమ్ పై,ఒక 30 సెకండ్లు వేపాలి.
4. వేపుకున్న తాళింపులో రుబ్బుకున్న బియ్యం పిండి, ఉప్పు వేసి, 3 నుంచి 4 నిముషాలు, మీడియం ఫ్లేమ్ పై దగ్గర పడేదాకా కలిపి దించేసుకోవాలి.
5. దింపుకున్న పిండి ముద్దలో కొబ్బరి పలుకులు వేసి వేడి మీదే, చేతులకు నూనె రాసుకుని,పిండిని బాగా వత్తుకోవాలి.
6. బాగా కలిపిన పిండిని, గుండ్రంగా, చిన్న ఉండలుగా చేసుకోవాలి.
7. చేసుకున్న ఉండలను, ఆవిరి పైన 15 నిముషాలు ఉడికించాలి.
8. చివరగా, ఉడికిన ఉండలను వేడిగా కాని చల్లగా కాని ఎలా తిన్నా రుచిగా ఉంటాయి.