Kitchenvantalu

Sorakaya Kobbari Palakura :కొబ్బరి పాలు పోసి సొరకాయ కూర వండితే ఎంత బాగుంటుందో..

Sorakaya Kobbari Palakura :కొబ్బరి పాలు పోసి సొరకాయ కూర వండితే ఎంత బాగుంటుందో.. సొరకాయ కొబ్బరి పాల కూర.. సొరకాయతో సాంబార్ ,సొరకాయతో రోటి పచ్చడి టేస్ట్ చేసే ఉంటారు. సాధారణంగా అందరు అవ్వే చేస్తుంటారు.కాని కొబ్బరిపాలతో సొరకాయ పచ్చడి చేసారంటే మీ వీక్లి మెనులో రెండు మూడు సార్లైనా ఈ పచ్చడిని యాడ్ చేస్తారు.మరి సొరకాయ కొబ్బరి పాలపచ్చడి ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సొరకాయ ముక్కలు – ½ కిలో (లేతది, తొక్కు తీసినవి)
పెరుగు- ½ కప్పు
చిక్కటి కొబ్బరి పాలు -300 ml
పచ్చిమిర్చి- 5-6
కరివేపాకు-2 రెమ్మలు
ఉప్పు-తగినంత
నూనె- 1 టేబుల్ స్పూన్
ఆవాలు- ½ టీ స్పూన్
మినపప్పు-½ టీ స్పూన్
జీలకర్ర-½ టీ స్పూన్
ఎండుమిర్చి- 2

తయారీ విధానం
1.ముందుగా ఒక బాండీలో పెరుగు వేసుకుని, ¼ లీటర్ వరకు నీళ్లు వేసుకుని, పల్చని మజ్జిగలా తయారు చేయాలి.
2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బాండీ పెట్టుకుని, అందులోకి సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి , ఉప్పు, వేసి కలుపుకుని, మూత పెట్టి, మజ్జిగ ఆవిరి అయిపోయేవరకు ఉడికించాలి.
4. సొరకాయ ముక్కలు ఉడికించి, ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, అందులోకి జీలకర్ర , ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని, తయారు చేసుకున్న తాళింపును, సొరకాయ కొబ్బరి పాల కూరలో మిక్స్ చేసుకోవాలి.
5. అంతే కర్రీ రెడీ అయిపోయినట్లే!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."