MoviesTollywood news in telugu

NTR తొలి పారితోషికం ఎంత…ఏమి చేశాడో తెలుసా?

Jr NTR first remuneration : సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు వారి అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు.

ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ లో ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్ వేరు. వరుస హిట్స్ తో విభిన్న పాత్రలతో డబుల్, త్రిబుల్ రోల్స్ లో సైతం తారక్ ఆకట్టుకున్నాడు. తాత పోలికలున్నాయంటూ ఈయనికి అప్పటికే మంచి గుర్తింపు రావడంతో నందమూరి అభిమానులకు అభిమాన పాత్రుడయ్యాడు. ఒక్కో సినిమాకు కనీసం 50 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు.
Jr NTR first remuneration
మిగతా హీరోలతో పోలిస్తే, కేవలం 17 ఏళ్ల వయసులోనే హీరో అయిపోయాడు. అంతకుముందే గుణశేఖర్ తెరకెక్కించిన బాల రామాయణం సినిమాతో బాలా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి అవార్డులతో పాటు ప్రశంసలు వచ్చాయి. దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా తారక్ ఎంట్రీ ఇచ్చాడు. ఓటు హక్కు కూడా రాని వయసులో, మూతిమీద మీసాలు కూడా లేని టైమ్‌లోనే ఇండస్ట్రీ రికార్డులతో ఆడుకున్నాడు.
Ntr Watch price
నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా తారక్ నిలబడ్డాడు. ఇప్పుడు బాబాయ్ కంటే చాలా పైనే ఉన్నాడని చెప్పాలి. స్టూడెంట్ నెం 1, ఆది సినిమాలతో తానేంటో నిరూపించుకుని, ఇక సింహాద్రి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జూనియర్ కెరీర్ ఆరంభంలోని కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tollywood Hero Ntr
ముఖ్యంగా తొలి సినిమా పారితోషికం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తారక్ హీరోగా విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్ను చూడాలని డిజాస్టర్ అయినప్పటికీ గుర్తింపు బాగానే వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌కు నిర్మాత రామోజీ రావు 4 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. నిజానికి అప్పటికి ఆ ఎమౌంట్ తక్కువేమీ కాదు. అయితే ఓటు హక్కు కూడా రాని ఎన్టీఆర్ ఆ 4 లక్షలతో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ సొమ్ము తీసుకెళ్లి తల్లి శాలినికి తారక్ గిఫ్ట్ గా ఇచ్చేశాడట.