Drinking Water:రోజుకి ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెలుసా..
Drinking Water:రోజుకి ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెలుసా.. ప్రతిరోజు నీటిని తాగాల్సిందే. మన శరీరానికి అవసరమైన నీటిని తాగటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని మనలో చాలామంది రోజులో ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. అయితే మన శరీరానికి సరిపడా నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అదే ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు వస్తాయి.
ఈ రోజు ఆ సమస్యల గురించి తెలుసుకుందాం. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ సమతుల్యత తగ్గి అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో తేమ శాతం ఎక్కువ అయితే రక్తనాళాల్లో గుండెపై అదనపు భారం పడుతుంది. కిడ్నీల పై ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీల పనితీరు పై ప్రభావం పడుతుంది.
నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది .అలా ఎక్కువ సార్లు వెళితే శరీరంలో ఉన్న ఖనిజ లవణాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. అలా సోడియం ఎక్కువగా బయటికి పోతే ప్రాణాలకే ప్రమాదం. నీరు ఎక్కువగా తాగడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ పై భారం పడి తలనొప్పి వికారం నొప్పులు వస్తాయి.
ఏదైనా లిమిట్గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. లిమిట్ దాటి తేనే సమస్యలు వస్తాయి కాబట్టి నీటిని తాగి ప్రయోజనాల్ని పొందాలి. స్త్రీలు ప్రతి రోజు 11.5 కప్పుల నీళ్ళు తాగాలి. అంటే 2.7 లీటర్లు. అలాగే పురుషులు 15.5 కప్పుల నీళ్ళు తాగాలి. అంటే 3.7 లీటర్లు తాగాలి. అయితే ఖచ్చితంగా ఇలా తాగాలి అని కాదు. మీరు ఉండే ప్రదేశం, వాతావరణం బట్టి కూడా కొంచెం ఎక్కువ లేదా తక్కువగా తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.