Honey:ఫ్రిజ్ లో పెట్టిన తేనె వాడవచ్చా.. కొన్ని నమ్మలేని నిజాలు మీకోసమే..
Honey:ఫ్రిజ్ లో పెట్టిన తేనె వాడవచ్చా.. కొన్ని నమ్మలేని నిజాలు మీకోసమే.. తేనెలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనె తరచు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం తేనె స్వచ్ఛంగా దొరకటం కష్టం అయిపోతుంది. ఎక్కువగా కల్తీ తేనే దొరుకుతుంది. కల్తీ తేనె వాడటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చాలామంది తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా అని తేనెను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఫ్రిజ్ లో స్టోర్ చేసిన తేనే వాడవచ్చా అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. స్వచ్ఛమైన తేనె ఫ్రిజ్లో నిల్వ చేస్తే గడ్డకట్టదు. కానీ తేనెలో చక్కెర మిశ్రమం కలిపితే మాత్రం ఫ్రిజ్ లో పెట్టినప్పుడు గడ్డకడుతుంది
తేనెలో కలిపిన చక్కెర మిశ్రమంలో ఉన్న చక్కెర ఫ్రిజ్ లో ఉన్న చల్లదనానికి చిన్న చిన్న గుళికలుగా మారుతుంది. కొంతమంది తేనే మిశ్రమానికి మొక్కజొన్న సిరప్ కలిపి ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తేనె పల్చగా అవుతుందని చెబుతూ ఉంటారు. ఫ్రిజ్ లో పెట్టిన తేనే వాడవచ్చా అనే విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఫ్రిజ్ లో పెట్టిన తేనే తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.
ఫ్రిజ్ లో పెట్టినప్పుడు దానిలో ఉండే బ్యాక్టీరియా ప్రభావంతో నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన తేనెను తీసుకోవడం మంచిది. అలా అని తేనెను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి సరైన మోతాదులో తేనె తీసుకుని తేనెలో ఉన్న ప్రయోజనాలను పొందండి. రోజులో ఎంత మోతాదులో తేనె తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి ఫ్రిజ్ లో నిల్వ చేసిన తేనెను ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అదే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న తేనె అయితే రెండు స్పూన్ల వరకు తీసుకోవచ్చు.