Uric Acid:యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఈ పొడి తీసుకుంటే…
Uric Acid:యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఈ పొడి తీసుకుంటే… యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారు శొంఠి పొడి తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు యూరిక్ యాసిడ్ ని నియంత్రణలో ఉంచే ఆహారాల మీద శ్రద్ద పెట్టాలి. శొంఠి పొడి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో తయారయ్యే ఒక రసాయనం. ఆహారంలో ప్యూరిన్స్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది. అలాగే మూత్రపిండాల ద్వారా శరీరం నుండి బయటకు పంపబడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు, అది కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి గౌట్‌కు కారణమవుతుంది.
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాళ్లలో నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి. శొంఠిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, విటమిన్లు A మరియు C, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలుసమృద్దిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి మరియు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. పాలతో శొంఠి పొడి కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ శొంఠి పొడిని కలిపి తాగవచ్చు. అలాగే భోజనం చేసినప్పుడు శొంఠి పొడి కలిపిన అన్నంను మొదటి ముద్దగా తినవచ్చు.ఇది శరీరంలో యూరిక్ స్థాయిలను తగ్గించటమే కాకుండా కీళ్ల నూపులు,మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
శరీరం నిర్విషీకరణ చెందుతుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. యూరిక్ యాసిడ్ కూడా శరీరంలో ఉత్పత్తి చేయబడిన ఒక టాక్సిన్, శొంఠి పొడి తీసుకుంటే శరీరం నుండి… టాక్సిన్ లను బయటకు పంపుతుంది. శొంఠి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ శొంఠి కొమ్ములను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యి లేదా నూనెలో వేగించి పొడి చేసుకొని వాడితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK