Weight Loss:వీటిని ఉడికించి 1 కప్పు తింటే అధిక బరువుతో సహా ఎన్నో సమస్యలకు చెక్..
Weight Loss:వీటిని ఉడికించి 1 కప్పు తింటే అధిక బరువుతో సహా ఎన్నో సమస్యలకు చెక్.. ఈ మధ్య కాలంలో మంచి పోషకాలు ఉన్న ఆహారం మీద ఎక్కువగా శ్రద్ద పెడుతున్నారు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అయ్యేవారు క్వినోవా ను తింటారు. దీనిలో ప్రోటీన్స్, తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఒక కప్పు క్వినోవాను ఉడికించి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
దీనిలో ప్రోటీన్,ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే తినాలనే కోరిక తగ్గుతుంది. జీర్ణక్రియ రేటును పెంచుతుంది. దీనిలో ఉండే 20-హైడ్రాక్సీక్డైసోన్ అనే సమ్మేళనం శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే ఆహారం నుండి తక్కువ కొవ్వును గ్రహించేలా చేస్తుంది. దాంతో చాలా సులభంగా బరువు తగ్గుతారు.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ఆహారం అని చెప్పవచ్చు. దీనిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరుస్తుందని మరియు రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. క్వినోవాలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాక దీనిలో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. మెగ్నీషియం రక్త నాళాలను సడలించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పిని ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. క్వినోవాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు వండిన క్వినోవా (185 గ్రాములు)లో దాదాపు 3 mg ఇనుము ఉంటుంది.
ఇది రోజువారీ అవసరంలో 15%. ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారం రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. రిబోఫ్లావిన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా రక్తహీనత ఏర్పడవచ్చు. క్వినోవాలో రిబోఫ్లావిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. క్వినోవా తిన్న తర్వాత కడుపునొప్పి, దురద, వాంతులు వంటి లక్షణాలు ఉంటే మాత్రం క్వినోవాకి దూరంగా ఉంటేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK