Healthhealth tips in telugu

Puffed Rice:మరమరాలు అందరికి తెలుసు…కానీ వీటిల్లో ఉన్న ఈ రహస్యం..

Puffed Rice:మరమరాలు అందరికి తెలుసు…కానీ వీటిల్లో ఉన్న ఈ రహస్యం.. మరమరాలను ప్రాంతాన్ని బట్టి బొరుగులు, ముర్ముర్లు, మురీలు అని పిలుస్తారు. సాధారణంగా మనలో చాలా మంది మరమరాలను తింటూ ఉంటాం. కానీ వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు. మరమరాలు చాలా తేలిగ్గా ఉండి కడుపు నిండని ఆహారం. మరమరాలలో కొవ్వు,కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

మరమరాలును చిన్న పెద్ద అనే తేడా లేకండా ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. వీటిల్లో పోషకాలు వరి అన్నంతో సమానంగా ఉంటాయి. మరమరాలను చక్కని బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాకుండా స్నాక్స్ లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది. మరమరాలలో విటమిన్‌ – డి, విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని రైబోఫ్లేవిన్, థయామిన్‌ లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉండుట వలన పిల్లల ఎదుగుదలలో బాగా సహాయపడుతుంది.
Joint Pains
అంతేకాక ఎముకలు, పళ్లు మరింత పటిష్టంగా, బలంగా ఉండేలా చూస్తాయి. ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండుట వలన కొంచెం తిన్నా సరే కావలసిన శక్తి సమకూరుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంతో మరమరాలతో తయారయిన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.

మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. నాడీ మండలంలోని నరాలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా మరమరాలు జ్ఞాపకశక్తిని, నేర్చుకునే శక్తిని పెంపొందిస్తాయి.బరువు తగ్గాలనుకునే వారికి, ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు మరమరాలు మంచివి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
Weight Loss tips in telugu
బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహార ఎంపికగా చెప్పవచ్చు. కేలరీలు,కొవ్వు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది. కొంచెం
మరమరాలు తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. మరమరాలలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయటానికి సహాయపడుతుంది. మారుమూరలలో విటమిన్ డి, కాల్షియం, ఐరన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు మరియు దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
White teeth tips
ప్రతి రోజు 100 గ్రాముల మరమరాలు తింటే శరీరంలో అలసట,నీరసం,బలహీనతను తగ్గించి శక్తిని అందిస్తుంది. 100 గ్రాముల మరమురాలలో 90 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్ మీ శరీరంలో శక్తిని పెంచినీరసాన్ని తొలగిస్తుంది, కాబట్టి కాస్త అలసటగా ఉన్నప్పుడు మరమరాలను తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.