Diabetes Diet:షుగర్ ఉన్నవారికి ఈ గింజలు దివ్య ఔషధం…
Diabetes Diet:షుగర్ ఉన్నవారికి ఈ గింజలు దివ్య ఔషధం… ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. చియా సీడ్స్ డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి. ఈ మధ్యకాలంలో చియా సీడ్స్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలు చాలా చిన్నగా ఉంటాయి. ఈ గింజలను నీటిలో వేయగానే నాని ఊపుతాయి. అర స్పూన్ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రెండు గంటల పాటు అలా వదిలేస్తే గింజలు .బాగా ఉబ్బి జెల్లీలా తయారవుతాయి. వీటిని నానబెట్టి ఈ విధంగా తీసుకుంటే డయాబెటిస్ ఉన్న వారిలో చాలా ప్రయోజనం కలుగుతుంది.
చాలామందికి ఇన్సులిన్ తగిన మోతాదులో ఉత్పత్తి కాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. సరైన రీతిలో ఇన్సులిన్ ఉత్పత్తి కావాలంటే జి ఎల్ పి వన్ హార్మోన్ అనేది పేగులలో విడుదల కావాలి. ఈ చియా సీడ్స్ తీసుకున్నప్పుడు మన పేగులలో ఈ హార్మోను విడుదల ఎక్కువగా అవుతుంది. జి ఎల్ పి వన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయితే ప్యాంక్రియాస్ గంధిని ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయమని ప్రోత్సహిస్తుంది. .
దాంతో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో ఎక్కువగా వస్తుంది. అలాగే చియా సీడ్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పేగుల్లో ఉండే ఆహార పదార్థాలను ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ నుండి విడుదలైన గ్లూకోజ్ ను రక్తంలోకి చేరకుండా ఆపుతుంది. కూరగాయలతో పోలిస్తే చియా గింజలలో ఐదు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది.
ఈ పైబర్ వల్ల గ్లూకోజ్ ఆటోమేటిక్ గా రెగ్యులేట్ మరియు కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా పేగులలో మంచి బాక్టీరియాను పెంచుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా అనేది జి ఎల్ పి వన్ హర్మోన్ రిలీజ్ అవ్వడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు చియా సీడ్స్ తీసుకుంటే చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ చియా సీడ్స్ నానబెట్టి భోజనానికి అరగంట ముందు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.