Acidity : అసిడిటీ, గ్యాస్, కడుపులో మంటకు.. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!
Acidity : అసిడిటీ, గ్యాస్, కడుపులో మంటకు.. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు.. సమస్య చిన్నగా ఉన్నప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాలను పొందవచ్చు.
ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ సమస్య రావటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, స్థూలకాయం, ఒత్తిడి… ఇలా కారణాలు ఏవైనా కావచ్చు.. నేడు చాలా మంది గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు.
వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో మందులను వాడుతుంటారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన సమస్యలు తగ్గినా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే గ్యాస్ సమస్య తగ్గించుకోవటానికి ఈ రోజు చాల ఎఫెక్టివ్ గా పనిచేసే ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. గ్యాస్ సమస్యను ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో ఎదుర్కొంటారు.
గ్యాస్ సమస్య ఉన్నప్పుడు వాంతులు, కడుపు నొప్పి మరియు ఛాతీ చికాకు పొట్టలో గ్యాస్ ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి.
ఈ విధంగా రోజులో రెండు సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. జీలకర్రలో కొన్ని ముఖ్యమైన నూనెలు లాలాజల గ్రంథులను ఉత్తేజపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్ సమస్య లేకుండా చేస్తాయి. దాల్చినచెక్కలోని నూనెలు శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
అందువల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. చాలా మంది గ్యాస్ సమస్య రాగానే మందులను వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా గ్యాస్, ఎసిడిటి, కడుపుఉబ్బరం, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.