Healthhealth tips in telugu

Peanut Benefits: ప్రతి రోజు 2 స్పూన్ల పల్లీలు తింటే..శరీంలో ఏం జరుగుతుందో తెలుసా?

Peanuts Benefits:ప్రతి రోజు పల్లీలు తినడం ద్వారా మనకు అవసరమైన ఫైబర్ సమృద్ధిగా అందుతుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో చాలా సహాయ పడుతుంది. అలాగే ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.

పొట్ట నిండిన అనుభూతితో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంచబడుతుంది. పల్లీలలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించి హుషారుగా ఉండేలా చేస్తుంది.

వేరుశనగలలో ఫైబర్‌లో సమృద్ధిగా ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అవి కండరాల వృద్ధికి కూడా చాలా ఉపయోగ పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగలలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉండి, ఎముకలను బలపరచడంలో మరియు ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకమైన పాత్ర వహిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పల్లీలు గుండె జబ్బులను నివారించి, జీర్ణ క్రియను మెరుగుపరచగలవు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్లు చర్మం రక్షణకు సహాయపడతాయి. పల్లీల్లో ఉండే పోలీ, మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫాట్స్, విటమిన్ బి3 మెదడుకు మంచిది.

వయసుతో వచ్చే అల్జీమర్స్ సమస్యలను ఇవి తగ్గించగలవు. రోజుకు 2 స్పూన్ల పల్లీలు తినడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. వేయించిన పల్లీల కంటే ఉడికించిన పల్లీలు తినడం ఉత్తమం. పల్లీలను కొద్దిగా బెల్లంతో కలిపి తినడం మంచిది.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ