How to Stop Snoring: గురకను శాశ్వతంగా నివారించే చిట్కాలు.. వెంటనే మీరూ పాటించండి
Snoring:గురక అనేది సాధారణ సమస్య అని అందరూ తెలుసుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా గురక రావచ్చు. గురక రావడం గురించి నిద్రలో ఉన్న వారికి సాధారణంగా అవగాహన ఉండదు.
గురక వల్ల పక్కవారికి నిద్ర పట్టకపోవడం సహజం. దీన్ని చిన్న సమస్యగా భావించకూడదు. ఈ సమస్యకు త్వరగా చికిత్స అవసరం. లేకపోతే, ఇది గుండె జబ్బులకు దారితీయవచ్చు. గురక రావడానికి అనేక కారణాలుండవచ్చు. తీసుకొనే ఆహారం నుండి శ్వాస నాళాల సమస్యల వరకు ఉండవచ్చు. సరైన నిద్ర లేకపోవడం కూడా గురకకు కారణం కావచ్చు.
గురక పెట్టే పద్ధతి ద్వారా కూడా సమస్యలను గుర్తించవచ్చు. నోరు తెరిచి గురక పెడుతూ నిద్రపోతే గొంతులోని మృదువైన కణజాలాల్లో సమస్య ఉన్నట్లు అర్థం. నోరు మూసుకుని గురకపెట్టుకుంటే నాలుకలో సమస్య ఉన్నట్లు భావించాలి. గురక సమస్యను తగ్గించే వివిధ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రాణాయామం
ప్రాణాయామం చేయటం ద్వారా శ్వాస నియంత్రణ మెరుగుపడుతుంది. దీనిని చేయడం వలన ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ బాగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరచుతుంది. ప్రాణాయామం వలన కేవలం గురక సమస్యలు మాత్రమే కాదు నిద్రలేమి సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
స్మోకింగ్
చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. పొగతాగే వారిలో గురక సమస్య ఎక్కువ. పొగతాగడం వల్ల శ్వాస క్రియ సరిగా జరగక ఊపిరి తిత్తులు నాశనం అవుతాయి. అందువల్ల స్మోకింగ్ ను మానేయడం మంచిది.
దిండు
గురక సమస్యను దిండు ఉపయోగించి కూడా తగ్గించవచ్చు. గురక పెట్టేవారు దిండును వాడండి. మరీ ఎత్తుగా లేదా మరీ పలుచగా కాకుండా తలగడను అమర్చండి. ఇది గురక సమస్యను కొంతమేరకు తగ్గించగలదు.
పసుపు పాలు
గురక సమస్యతో బాధపడే వారు రాత్రి నిద్రించే సమయంలో పసుపు కలిపిన వెచ్చని పాలు తాగాలి. ఇది గొంతులోని ఇరుకును తగ్గించి గురకను ఆపుతుంది. పసుపు పాలు నిద్ర బాగా పట్టటానికి కూడా సహాయపడతాయి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ