Dosa Batter : దోశల పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే..
Dosa Batter :చాలా మందికి దోశ చాలా ఇష్టం. సౌత్ ఇండియాలో దోశ ప్రసిద్ధిగాంచింది. దోశలు అనేక రకాలుగా ఉంటాయి. అందువల్ల ప్రజలు తరచుగా తమకు నచ్చిన దోశలను వండుకొని తింటారు.
లేదా బయట బండ్లపై లేదా హోటళ్ళలో వివిధ రకాల దోశలను ఆస్వాదిస్తారు. దోశలను కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీలతో మరియు సాంబార్‌తో కూడా తినొచ్చు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ దోశల కోసం చేసే పిండి ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేయలేము. కానీ ఈ క్రింది చిట్కాలను అనుసరిస్తే, దోశల పిండిని మీరు వారం రోజుల పైగా నిల్వ చేసుకోగలరు. మరి దానికి ఏమి చేయాలో చూద్దాం.
దోశల పిండిని ఫ్రిజ్‌లో పెట్టకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచితే అది త్వరగా పులిసిపోతుంది. అందుకే దోశ పిండి 2 రోజులకు మించి నిల్వ ఉండదు. పాడైపోతుంది. కానీ దోశల పిండిలో ఒక తమలపాకును కాడతో కలిపి ఫ్రిజ్‌లో ఉంచితే పిండి ఎప్పుడూ తాజాగా ఉంచగలరు. పిండిలో తమలపాకును వేసినప్పుడు, అది వారం రోజులకు పైగా నిల్వ ఉంటుంది.
దోశల పిండిని తయారు చేసిన తర్వాత, గాలి చొరబడని డబ్బాలో భద్రపరచాలి… గట్టిగా మూసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ పద్ధతిలో నిల్వ చేస్తే దోశల పిండి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
కొబ్బరిపాలు కలిపితే పిండి పులవకుండా ఉండి, దోశలు మరింత రుచికరంగా వస్తాయి. అలాగే జిప్‌లాక్ బ్యాగ్‌లో కూడా దోశల పిండిని నిల్వ చేయవచ్చు. జిప్ లాక్ బ్యాగ్‌లో దోశ పిండిని నింపి, దాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది. దోశ పిండిలో కరివేపాకులను కలపడం వలన పిండి మరింత కాలం నిల్వ ఉండి త్వరగా పులియకుండా ఉంటుంది.
ఫ్రిజ్ నుండి పిండిని తీసిన తర్వాత దాన్ని ఒక గంట పాటు బయట ఉంచి ఆ తర్వాత వాడాలి. వాడిన తర్వాత మళ్ళీ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ పద్ధతిని పాటిస్తే దోశ పిండి 7 నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ