Kitchenvantalu

Aloo Stuffed Mirchi Bajji: ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా.. వర్షా కాలంలో వేడి వేడిగా తింటే…

Aloo Stuffed Mirchi Bajji: ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా.. వర్షా కాలంలో వేడి వేడిగా తింటే…సాయంత్రం సమయంలో అందరూ ఇష్టపడే వంటకం పచ్చి మిర్చి బజ్జీలు. చలి మరియు వర్షాకాలాల్లో వీటిని వేడి వేడిగా తినడం అద్భుతం. ప్రతివారు తమ రుచికి అనుగుణంగా ఈ బజ్జీలను తయారు చేస్తారు. ప్రాంతం బట్టి వీటి రుచులు మారుతుంటాయి. మీరు ఎప్పుడైనా ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ ప్రయత్నించారా? వీటిని సాధారణంగా రోడ్ సైడ్ బండ్ల మీద అమ్ముతుంటారు.

మీరు ఎప్పుడైనా ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీలు తిన్నారా? లేకపోతే మీరు గొప్ప రుచిని మిస్ అయినట్టే. వీటి రుచి అంత అద్భుతంగా ఉంటుంది. తినే కొద్దీ మరింత తినాలనిపించేలా చేస్తుంది. పండుగలు లేదా వీకెండ్లలో వీటిని తయారు చేసి తినడం చాలా బాగుంటుంది. పైన క్రిస్పీ పొరలు లోపల మృదువైన, రుచికరమైన, మసాలా ఆలూ స్టఫ్ చేసిన బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీల తయారీ విధానం మరియు అవసరమైన పదార్థాలను చూద్దాం.

ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన బంగాళా దుంపలు, చనగ పిండి, బజ్జీ మిర్చీ, నూనె, ఉప్పు, కారం, కొత్తి మీర, చాట్ మసాలా, గరం మసాలా, వాము లేదా జీలకర్ర, నిమ్మ రసం, వంట సోడా, ఉల్లిపాయ.

తయారీ విధానం:
మొదట ఒక మందపాటి ఖాళీ కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. అదే సమయంలో మరో స్టౌవ్ పై ఒక పాత్రలో కొంచెం నూనె వేసి జీలకర్ర మరియు ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. వాటిని వేగించిన తర్వాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మెదిపి వేసి రెండు నిమిషాలు వేగించాక కారం, ఉప్పు, చాట్ మసాలా చల్లి బాగా కలిపి వేయాలి.

స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకుని నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిర్చీ బజ్జీలకు వాడే మిర్చీలను శుభ్రం చేసి మధ్యలో స్లిట్ చేసి విత్తనాలను తీసివేసి అందులో ముందుగా తయారు చేసిన ఆలూ మిశ్రమం నింపాలి. అన్ని మిర్చీల్లో ఆలూ మిశ్రమం నింపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత, ఒక లోతైన పాత్రలో శనగపిండి తీసుకోవాలి.

కొంచెం జీలకర్ర, కొంచెం కారం, వంట సోడా, తగినంత ఉప్పు కలిపి, బజ్జీల కోసం సరిపడా బ్యాటర్ తయారు చేయాలి. ఆలూ నిండిన మిర్చీలను శనగ పిండి బ్యాటర్‌లో ముంచి, నూనెలో వేయాలి. వీటిని రెండు వైపులా బంగారు రంగులో వేగించాలి. తర్వాత ప్లేట్‌లో తీసుకుని నిమ్మకాయ, ఉల్లిపాయలు, టమాటా కెచప్‌తో సర్వ్ చేయాలి. అల్లం చట్నీతో తిన్నా మరింత రుచికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఆలూ బజ్జీలను ఇలా వెరైటీగా తయారు చేసి, అందరినీ ఆశ్చర్యపరచండి.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ