Ghee Karam Dosa:ఏమీ తినాలి అనిపించడం లేదా.. ఈ దోశలను కార కారంగా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయి
Ghee Karam Dosa:ఏమీ తినాలి అనిపించడం లేదా.. ఈ దోశలను కార కారంగా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయి.. చాలామందికి దోశలంటే ఇష్టం. దోశల్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ప్రస్తుతం దోశల్లో పలు రకాలు ప్రసిద్ధి చెందాయి. కొన్ని దోశలను త్వరగా తయారు చేసి తినవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమి తినాలని అనిపించదు. ముఖ్యంగా చలికాలంలో అన్నం అసలు తినిపించదు.
రోజువారీ కూరలు, టిఫిన్లు మానుకొని, కారంగా ఉండే వెరైటీ దోశలను తయారు చేయండి. వీటి రుచి నోటికి ఇంపుగా ఉండి తినగా తినగా మరింత తినాలనిపించేలా ఉంటుంది. రోడ్ల మీద తయారు చేసే దోశల్లో ఘీ కారం దోశ ఒక ప్రత్యేకత. ఈ దోశలను తయారు చేయడం చాలా సులభం. పిండి రుబ్బే అవసరం లేదు. వెంటనే తయారు చేసి ఆస్వాదించవచ్చు. మరి ఈ దోశలను ఎలా తయారు చేయాలో, అవసరమైన పదార్థాలు ఏమిటో చూద్దాం.
ఇన్ స్టెంట్ ఘీ కారం దోశకు కావాల్సిన పదార్థాలు:
పెరుగు, గోధుమ పిడి, ఉప్మా రవ్వ, నెయ్యి, కారం, వంట సోడా, ఉప్పు.
ఇన్ స్టెంట్ ఘీ కారం దోశ తయారీ విధానం:
మొదట ఒక కప్పు ఉప్మా రవ్వను జార్‌లో వేసి కొంచెం బరకగా ఉండేలా మిక్సీలో తిప్పాలి. అనంతరం అదే జార్‌లో రెండు స్పూన్ల గోధుమ పిండి, కొంచెం పెరుగు, ఉప్పు, నీళ్లు జోడించి, దోశ పిండి వంటిది కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత చిన్న బౌల్‌లో కొంచెం నెయ్యి, మరో బౌల్‌లో కొంచెం కారం తీసుకోవాలి. పది నిమిషాల అనంతరం పెనం మీద వేడి చేసుకోవాలి.
ముందుగా పక్కన పెట్టిన దోశ పిండిని తీసుకొని పెనం మీద పల్చగా వేయాలి. దోశ తడి ఆరిన తర్వాత కారం మరియు నెయ్యి జోడించి దోశను బాగా కాల్చాలి. ఇష్టపడేవారు దోశపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చీజ్ వేసుకోవచ్చు. ఘీ కారం దోశను సర్వింగ్ ప్లేట్‌లో వేసి టమాటా చట్నీ గానీ పల్లీల చట్నీతో గానీ తింటే రుచి అదిరిపోతుంది. మీ ఇంట్లో వారికి ఒకసారి ఇలా చేసి పెట్టండి, వారు మళ్లీ మళ్లీ అడగడం ఖాయం. అందుకే మీరు కూడా ట్రై చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ