Vitamin-D: విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే.. సూర్యకాంతిలో ఏ సమయంలో గడపాలంటే..
Vitamin-D: విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే.. సూర్యకాంతిలో ఏ సమయంలో గడపాలంటే..ఈ మధ్య కాలంలో ఎక్కువగా విటమిన్ D లోపం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఎముకలు బలంగా ఉంచడంలోనూ, శరీరాన్ని చురుగ్గా ఉంచడంలోనూ, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచడంలోనూ విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్-డి సూర్య కాంతి శరీరానికి సోకినప్పుడు శరీరంలో తయారవుతుంది. సూర్య కాంతి శరీరానికి సోకినప్పుడు శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ చర్య జరపడం ద్వారా విటమిన్-డి ని తయారుచేస్తుంది.ఈ సమస్య ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకూడదు. మన శరీరంలో ప్రతి అవయవానికి విటమిన్ డి చాలా అవసరం.
విటమిన్ డి అనేది రోగనిరోధక వ్యవస్థకు శరీరానికి శక్తిని అందించేందుకు బాగా సహాయపడుతుంది. మనలో చాలా మంది ఎండలో ఏ సమయంలో ఎంతసేపు ఉండాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. అయితే ఈ సమయం ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆయా వ్యక్తుల చర్మం తీరును బట్టి కూడా ఉంటుంది.
ఉదయం సమయంలో సూర్యోదయం తర్వాత 8 గంటల లోపు 15 నుంచి 20 నిమిషాలు ఉండాలి. సాయంత్రం సమయం అయితే సూర్యాస్తమయం సమయంలో ఎండలో కూర్చుంటే శరీరానికి విటమిన్ డి అందుతుందని నిపుణులు చెప్పుతున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది.
సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్,మెలటోనిన్,డోపమైన్ అనేవి ఆందోళన,డిప్రెషన్ వంటి వాటిని తగ్గించి మానసిక ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. విటమిన్ డి లోపం కారణంగా అలసట,నీరసం, ఆలోచనాశక్తి తగ్గిపోవటం,ఆకలి లేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, కండరాల నొప్పులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డి సమృద్దిగా లభించే ఆహారాలను తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ