Boiled rice water:అన్నం వండి గంజి నీళ్లు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!
Boiled rice water:అన్నం వండి గంజి నీళ్లు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే.. గంజిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
మారిన జీవనశైలి పరిస్థితికి తగ్గట్టుగా మన ఆహారంలో కూడా మార్పులు చేసుకోవటం తప్పనిసరి. ప్రతి రోజు గంజి తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారంటే గంజి వంటి ఆహారాలను తీసుకోవటం ఒక కారణం అని చెప్పవచ్చు.
ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ప్రతి ఒక్కరూ మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి గంజి అంటే తెలియదు. పిజ్జా, బర్గర్లు అంటే తెలుస్తుంది. కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారి పోతున్నాయి.
మన పెద్దవారు తినే ఆహారం అసలు మనం తినడం లేదు. అందువల్లే మన పెద్దవాళ్ళు ఉన్నంత ఆరోగ్యంగా మనం ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ వారు ఆరోగ్యం కోసం కాకుండా రుచి కోసం ఆహారాన్ని తింటున్నారు. అందువల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అప్పట్లో బియ్యాన్ని ఒక గిన్నెలో ఉడికించి గంజిని వంచి తాగేవారు.
అయితే ఇప్పుడు అన్నం కుక్కర్ లో పండు కోవడం వలన గంజి అనేది రా…వటం లేదు. అందుకే ఈ తరం వారికి గంజి అంటే తెలియడం లేదు. గంజి లో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే అన్నమును వార్చుకొని గంజిని తయారుచేసుకుని తాగుతారు. గంజి లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
స్నానం చేసే నీటిలో కొంచెం గంజి కలిపి స్నానం చేస్తే రోజంతా హుషారుగా ఉంటారు.గంజిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాస్త అలసటగా నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పుడు గంజి తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. వాంతులు విరేచనాలతో బాధపడేవారికి గంజినిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. గంజిని ముఖానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది.
అదే జుట్టుకు రాస్తే గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు రాలకుండా మృదువుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గంజిలో మన శరీరానికి కావలసిన 8 రకాల ఎమినో యాసిడ్లు ఉంటాయి. అవి మనకు గ్లూకోజ్ కంటే ఎక్కువగా తక్షణ శక్తిని అందిస్తాయి. ఒక గ్లాస్ గంజిలో కొద్దిగా ఉప్పువేసి కలిపి తాగితే డయేరియా సమస్య నుండి బయట పడవచ్చు.
ఈ సీజన్ లో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారికి చాలా మంచి చేస్తుంది. గంజి వల్ల శరీరానికి శక్తి అంది కండరాలు దృఢంగా అవుతాయి. ప్రతి రోజు గంజి తాగితే శారీరక బలహీనత అసలు ఉండదు. కాబట్టి ఇప్పటి నుండి గంజి తాగటం అలవాటు చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ