Piles : ఇవి తింటే పైల్స్ తగ్గిపోతాయట…
Piles : ఇవి తింటే పైల్స్ తగ్గిపోతాయట… నేటి ఫాస్ట్ లైఫ్ కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. అందులో పైల్స్ కూడా ఒకటి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. లోపలే ఉండేవి. బయటకి కూడా ఉండి ఇబ్బంది పెట్టేవి. పైల్స్ చాలా సాధారణమే కానీ దాని ద్వారా వచ్చే నొప్పి ఇబ్బంది వర్ణనాతీతం.
ఏదో ముళ్ళ పై కూర్చున్నట్లు ఉంటుంది పరిస్థితి మలవిసర్జన సమయంలో నరకం కనిపిస్తుంది. రక్తంతో కూడిన మలం, పూర్తిగ మలవిసర్జన జరగకపోవడం ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి.చాలా వరకూ పైల్స్ కొన్ని ఆహార, జీవన మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు
పైల్స్ సమస్య ఉన్నప్పుడు నిలబడాలన్నా,కూర్చోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.అలాగే విపరీతమైన నొప్పి ఉంటుంది. పైల్స్ సమస్యను తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. 50 గ్రాముల ఎండు ద్రాక్ష, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల పసుపు తీసుకోవాలి. జీలకర్రను దోరగా వేగించాలి.
ఎండుద్రాక్ష,జీలకర్ర,పసుపు మెత్తని పేస్ట్ గా చేసి దీనిలో కాస్త తేనె కలిపి చిన్న చిన్న మాత్రల వలె తయారుచేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున నోట్లో వేసుకొని ఒక గ్లాస్ మంచి నీటిని తాగాలి. ఇలా మాత్రలను వాడుతూ పైల్స్ ఉన్న ప్రదేశంలో పైపూతగా రాయటానికి ఒక నూనెను తయారుచేసుకుందాం.
100 Ml ఆముదం, 25 గ్రాముల తేనె మైనంలను వేడి చేసి దానిలో 20 గ్రాముల కర్పూరం పొడి వేసి బాగా కలిపి డబ్బాలో నిల్వ చేసుకొని… పైల్స్ సమస్య ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి,రాత్రి సమయంలో ఒకసారి రాస్తే మూడు రోజుల్లో పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ