Neem for Diabetes:డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆకులను నమిలితే షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది
Neem for Diabetes:డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆకులను నమిలితే షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది.. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఒక ఆకు గురించి తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో నార్మల్ గా ఉన్న వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటిస్ అనేది గుండె, ప్యాంక్రియాస్, కిడ్నీ మొదలైన ముఖ్యమైన అవయవాల మీద ప్రభావాన్ని చూపుతుంది. డయాబెటిస్ నియంత్రణలో వేప ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.
ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుంచి వేపను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వేప ఆకుల్లో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ సి అనేవి డయాబెటిస్ నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. వేప ఆకులు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి.
వేప ఆకులలో విటమిన్-ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ మరియు ఫ్లేవ నాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన మధుమేహంతో బాధపడే వారికి మేలు చేయటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. అయితే వేప ఆకులను ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ మధ్య కాలంలో దాదాపుగా ప్రతి ఇంటిలో వేప మొక్క ఉంటుంది. కాబట్టి తాజా ఆకులను ఉపయోగించవచ్చు.
డయాబెటిస్ తో దీర్ఘకాలంగా బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మూడు వేప ఆకులను నమలడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మరియు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
వేప ఆకులను నమలటం కష్టంగా ఉన్నవారు రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో మూడు వేప ఆకులను వేసి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి తాగవచ్చు…లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి మూడు వేప ఆకులను వేసి అరగ్లాసు నీరు అయ్యేవరకు మరిగించి…ఆ నీటిని వడకట్టి తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ