Jiont pains,కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ ఆహారాన్ని తీసుకుంటే నొప్పులు మాయం
Jiont pains,కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ ఆహారాన్ని తీసుకుంటే నొప్పులు మాయం.. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పోషకాహార, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమేగా 3 కొవ్వు అమ్లాలు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కీళ్ల నొప్పులను, శరీరంలో కలిగే ఏ నొప్పినైనా తగ్గించగలవు. ఈ క్రమంలో ఏయే ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి వచ్చేస్తున్నాయి. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవటం వలన నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి. ఇవి ప్రారంభంలో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
వెల్లుల్లిని ప్రతి రోజు ఆహారంలో బాగంగా చేసుకోవాలి. వెల్లుల్లి రెండు రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో ఒక గంట నానబెట్టి తినవచ్చు. లేదా మధ్యాహ్నం భోజనంలో వేడి అన్నంలో వెల్లుల్లి రెబ్బలను పెట్టి తినవచ్చు. వెల్లుల్లిలో ఉండే లక్షణాలు నొప్పులను,వాపులను తగ్గించటానికి సహాయపడుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు వెల్లుల్లిని పరగడుపున తినకూడదు.
రోజుకి 5 బాదం పప్పులను తినవచ్చు. బాదం పప్పులను నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. లేదా బాదం పప్పును పొడిగా తయారుచేసుకొని పాలల్లో కలుపుకొని తాగవచ్చు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాపు, కీళ్లనొప్పుల లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
మెంతులు నొప్పులను,వాపులను తగ్గించటంలో బాగా సహాయపడుతుంది. ఒక స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. లేకపోతే మెంతులను దోరగా వెగించి పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పావు స్పూన్ పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం సమయంలో తీసుకోవచ్చు.