Healthhealth tips in telugu

Hemp Seeds Benefits: ఈ గింజలు మీ ఇంట్లో ఉంటే చాలు ఆరోగ్యం మీ చెంతే..

Hemp Seeds Benefits: ఈ గింజలు మీ ఇంట్లో ఉంటే చాలు ఆరోగ్యం మీ చెంతే..ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల గింజలు మీ డైట్ లో చేర్చుకోవాలని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు జనపనార గింజల్లో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Hemp Seeds అంటే జనపనార విత్తనాలు. ఇవి ఒకప్పుడు చాలా తక్కువగా లభించేవి. కానీ ఇప్పుడు విరివిగానే లభిస్తున్నాయి. వీటిల్లో ఫైబర్, అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు, అధిక స్థాయిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుముతో పాటుగా, 21 రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.
Hemp Seeds benefits
వీటిల్లో కరిగే, కరగని ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది. కరిగే ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.కరగని ఫైబర్ మలబద్ధకం కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.
Hemp Seeds 1
అలాగే నిద్రను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన జనపనార విత్తనాలను తరచుగా తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచటంలో సహాయపడటమే కాకుండా గుండె సమస్యలు లేకుండా చేస్తుంది.
Hemp Seeds Uses
వీటిల్లో కాల్షియం స్థాయి ఎక్కువగా ఉండటం వలన ఎముకలను పటిష్టం చేయటానికి, దెబ్బతిన్న ఎముక పదార్థాన్ని మరమత్తు చేయడానికి సహాయపడి నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో ప్రోటీన్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంచడమే కాకుండా ఆకలి తొందరగా వెయ్యకుండా చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది
Hemp seeds use
ఈ విత్తనాల లో 21 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండటంవల్ల శరీరంలో కొత్త కణజాలం సృష్టించడం పెంచడం ఎముకల సాంద్రతను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. జనపనార విత్తనాలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. జనపనార విత్తనాలను నానబెట్టి పేస్ట్ గా చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు. ఈ విత్తనాలను వేగించి పొడిగా చేసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగవచ్చు.