Kitchenvantalu

Kakarakaya Pulusu: చేదు లేని కాకరకాయ పులుసు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

Kakarakaya Pulusu:చిక్కగా కమ్మగా ఉండే చేదు లేని కాకరకాయ పులుసు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వారంలో ఒకసారైన కాకరకాయను తప్పనిసరిగా తినటం అలవాటుగా చేసుకోవాలి.

రుచికి చేదైనా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, కాకరకాయను, వారంలో ఒక్కసారైనా తినాలి. ముఖ్యంగా వర్షా కాలంలో కాకరకాయ తింటే,బాడీలో వేడిని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో, ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయ ముక్కలు – 250 గ్రాములు
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – ¼ టీస్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి -2
వెల్లుల్లి రెబ్బలు-5
ఇంగువ – చిటికెడు
చింతపండు గుజ్జు – ¼ కప్పు
బెల్లం- ¼ కప్పు
ఉప్పు – తగినంత
కారం – ½ టీ స్పూన్
పసుపు – చిటికెడు
పచ్చిమిర్చి -2
తరిగిన ఉల్లిపాయలు – 1/2కప్పు
శనగపిండి – 2 టీ స్పూన్స్

తయారీ విధానం
1.కాకరకాయను పై పొట్టును తొలిగించి, చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి.
2.అందులోకి ఉప్పు , పసుపు వేసుకుని, తగినన్ని నీళ్లు పోసి, మెత్త పడే వరకు ఉడికించాలి.
3.ఉడికిన కాకరముక్కను వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి, ఆయిల్ వేసుకుని, అందులోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, వేసి వేయించుకుంటూ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి.

5.ఇప్పుడు మసాలా తగినట్లుగా, ఉల్లి పాయలు , పచ్చిమిర్చి, కారం పొడి, ఉప్పు, కొద్దిగా పసుపు, వేసుకుని నూనె పైకి తేలేవరకు వేయించుకోవాలి
6.ఇప్పుడు అందులోకి ఉడికిన కాకర ముక్కలను వేసి , 3 నుంచి 4 నిముషాలు వేయించుకోవాలి.
7.అందులోకి కాకరకాయ ఉడికించిన నీరును పోసుకోవాలి.
8.ఇప్పుడు అందులోకి చింతపండు గుజ్జు, తురిమిన బెల్లం వేసి 15 నిముషాల పాటు లో ఫ్లేమ్ లో మరిగించాలి.
9.ఇప్పుడు పులుసు కాస్త చిక్కగా మారిన తర్వాత అందులోకి 1/2కప్పు నీటిలో కొద్దిగా శనగపిండి వేసి పల్చని ధ్రవంలా తయారు చేసి, పులుసులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సెర్వ్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News