Healthhealth tips in telugu

Coriander Leaves: బరువు తగ్గడానికి కొత్తిమీరను ఇలా ప్రతి రోజు తీసుకోండి చాలు!

Coriander Leaves: బరువు తగ్గడానికి కొత్తిమీరను ఇలా ప్రతి రోజు తీసుకోండి చాలు.. అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. బరువు నియంత్రణలో.. బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే డైటింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గొచ్చు.

మనలో చాలా మంది వేలకొద్ది డబ్బులు ఖర్చు పెడుతూ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. దీనికోసం కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. కొత్తిమీరలో ఉన్న పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కొత్తిమీర పేస్ట్, అర చెక్క నిమ్మరసం పిండి మూత పెట్టాలి. 2 నిమిషాలు అయ్యాక ఈ కొత్తిమీర నీటిని ఒకసారి బాగా కలిపి తాగాలి. గ్యాస్ సమస్య లేనివారు ఉదయం పరగడుపున తాగవచ్చు. ఒకవేళ గ్యాస్ సమస్య ఉంటే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి.

ఉదయం తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగేముందు అరగంట కడుపు ఖాళీగా ఉంటే సరిపోతుంది.
నిమ్మరసంలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఒక నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది., ఆ ఫలితాన్ని చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది.