Bread Rasagulla:మిగిలిపోయిన బ్రెడ్‌తో టేస్టీ రసగుల్లా ఇలా చేసేయండి..
Bread Rasagulla:మిగిలిపోయిన బ్రెడ్‌తో టేస్టీ రసగుల్లా ఇలా చేసేయండి..బ్రెడ్ రసగుల్లా..రసగుల్లా స్వీట్ చాలా ఇష్టం ఉన్నా చేసుకోవాలంటే కాస్తా ఆలోచిస్తారు. అదో పెద్ద ప్రాసెస్ లా ఫీలైతారు.ఈజీగా ఇంట్లోనే రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ స్లైసెస్ – 7-8
చక్కెర – 1 కప్పు
కొబ్బరి పొడి – ½ కప్పు
పాలు – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – 1 టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను కట్ చేసుకోని తెల్లని ముక్కలను మిక్సి పట్టుకోవాలి.
2.ప్యాన్ లోకి పాలు వేసుకోని స్టవ్ పై పెట్టి వేడిచేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడిని వేసుకోవాలి.
4.అందులోకి కొబ్బరి పొడి, నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.పిండి తగినంత మెత్తగా లేనట్టయితే పాలను యాడ్ చేస్తు కలుపుకోని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
6.ఈ లోపు షుగర్ సిరప్ కోసం ప్యాన్ లో ఒక కప్పు పాలు,రెండు కప్పుల నీళ్లను వేడి చేసి చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి.
7.సిరప్ ని పదినిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు తయారు చేసుకున్న బ్రెడ్ ,పాల మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ ని తయారు చేసి షుగర్ సిరప్ లో వేసుకోవాలి.
9.ఇప్పుడు షుగర్ సిరప్ ను లో ఫ్లేమ్ పై వేడి చేసుకోని యాలకుల పొడి,డ్రై ఫ్రైట్స్ వేసుకోవాలి.
10.అంతే రసగుల్లా రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u