Tomato Curry:అన్నం,చపాతీ లలోకి రుచికరంగా టమాటో కూరని ఇలా చేసి చూడండి
Tomato Curry:అన్నం,చపాతీ లలోకి రుచికరంగా టమాటో కూరని ఇలా చేసి చూడండి..సింపుల్ టమాటో కర్రీ..చిటికెలో చేసే కర్రీ ఏదైనా ఉందంటే టమాటో Curry.ఏ కూరగాయలు లేకపోయినా ఒక్క టమాటోతో రుచికరమైన టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
టమాటోలు – ¼ kg
జీలకర్ర -1/2 టీ స్పూన్
ఉల్లిపాయలు – 1 కప్పు
పచ్చమిర్చి – 2
స్ప్రింగ్ ఆనియన్స్ – ¼ కప్పు
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర మెంతుల పొడి – ¼ టీ స్పూన్
పంచాదార – 1 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్,పచ్చిమిర్చి,స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఉడికించుకోవాలి.
3.వేగాక టమాట ముక్కలు వేసి కలుపుకోని మూతపెట్టుకోవాలి.
4.టమాట మగ్గాక ధనియాల పొడి,జీలకర్ర మెంతుల పొడి,నువ్వుల పొడి,పంచదార,వేసి ½ కప్పు నీళ్లను వేసి కలుపుకోవాలి.
5.ఐదు పది నిమిషాలు ఉడకించి కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో కర్రీ రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u