MoviesTollywood news in telugu

Manasantha Nuvve :మనసంతా నువ్వే సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో…

Manasantha Nuvve unknown facts in telugu :సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎం ఎస్ రాజు తీసిన మనసంతా నువ్వే సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే అంతకుముందు దేవి పుత్రుడు మూవీ ప్లాప్ కావడంతో ఏదైనా లవ్ స్టోరీ మూవీ తీయాలని ఆలోచించి ఎం ఎస్ రాజు చేసిన కసరత్తు ఫలితమే మనసంతా నువ్వే మూవీ. కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి ద్వారా వి ఎన్ ఆదిత్య గురించి విని డైరెక్టర్ గా ఎంట్రీ ఇప్పించాలని ఎం ఎస్ రాజు భావించారు. రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే ఏదోసమాధానం తప్ప డైరెక్ట్ గా రాలేదు. కానీ వారం తర్వాత వచ్చాడు. నాతొ సినిమా అంటే భయం వేసిందని అందుకే రావడానికి భయపడ్డానని ఆదిత్య వివరణ ఇచ్చాడు. మొత్తానికి పదిరోజులు ఇద్దరూ కల్సి మాట్లాడుకోవడంలో రెండు కథలు చర్చకు వచ్చాయి. అందులో రెండో కథ ఆదిత్యకు నచ్చేసింది.

వెంటనే కసరత్తు స్టార్ట్. హిందీలో వచ్చిన అన్ మూలం గడీ ప్రేరణతో కొంతవరకూ కథను తీర్చిదిద్దారు. యాంటీ క్లాక్ బహుమతిగా ఇవ్వడం, తన లవ్ స్టోరీనే నవలగా రాయడం అలాగే డవలప్ చేసారు. అలాగే భాగ్యరాజా తీసిన డార్లింగ్ డార్లింగ్ కూడా అదే రీతిలో ఉంటుంది. దాంతో చైల్డ్ హుద్ నుంచి ప్రేమను మొదలు పెట్టాలని భావించడమే కాదు, అప్పుచేసి పప్పు కూడు సినిమాలో రేలంగి పాత్ర మాదిరిగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు. ఇలా స్క్రిప్ట్ సాగిపోతోంది. సముద్రపు ఒడ్డున హీరోతో ఫ్రెండ్ నిలబడి ఉన్నప్పుడు,వర్షం వస్తుంది. ‘వర్షం కూడా అప్పుడప్పుడు మేలు చేస్తుంది రా .. మన కన్నీళ్లను కనపడకుండా దాచేస్తుంది’అని హీరో ఫ్రెండ్ అనడం. ఈ డైలాగ్ కి ఎం ఎస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే పాతికవేలు చెక్ రాసిచ్చి రేపే షూటింగ్ అన్నారు

ఎం ఎస్ రాజు. కొత్త కుర్రాడు ఆదిత్య డైరెక్షన్ లో సినిమా అని ప్రకటన కూడా ఇచ్చేసారు. టైటిల్ కూడా మనసంతా నువ్వే అని ఎం ఎస్ రాజు పెట్టిందే. మహేష్ బాబుతో తీయాలని ఎం ఎస్ రాజు కోరిక. కొత్తవాడు కావాలని ఆదిత్య. సరిగ్గా అదేసమయంలో నువ్వు నేను రష్ చూసిన ఎం ఎస్ రాజు వెంటనే ఉదయ్ కిరణ్ ని ఫిక్స్ . స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ కి చేరడం,కథ అంతగా బాలేదని,సెకాండాఫ్ మార్చాలని,చైల్డ్ హుడ్ డేస్ కొంచెం కట్ చేయాలనీ చెప్పేసరికి ఆదిత్య గుండె జారిపోయింది.

మొత్తానికి అరకులో పదిరోజులు అందరూ కూర్చున్నారు. వీరు పోట్ల కూడా వచ్చాడు. మొత్తానికి కథ బాగా తీర్చి దిద్దారు. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అదరగొట్టాడు. మలయాళంలో విద్యాసాగర్ చేసిన సాంగ్ ని యధాతధంగా తూనీగా తూనీగా సాంగ్ గా చేసాడు. 95శాతం షూటింగ్ కూడా అయింది. ఇక హీరోయిన్ రీమాసేన్ బట్టలు కొనుక్కునే సీన్ తీయాలి. కానీ బట్టల షాపు బదులు బుక్ షాపులో తీస్తే బావుంటుందేమో అని ఎమ్మెస్ రాజు అనడంతో ఆదిత్యలో టెన్షన్. మొత్తానికి రాజుని ఒప్పించాడు.

షూటింగ్ కంప్లీట్. ఎడిటింగ్ దగ్గరకొచ్చేసరికి సెకండాఫ్ దెబ్బతినేసిందని పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్య. అయితే ఎడిటర్ కెవి కృష్ణారెడ్డి ఇదంతా అబ్జార్వ్ చేస్తూ,ఒక్కసారి క్లైమాక్స్ చూడమని కొంచెం ఎడిటింగ్ లో చేంజ్ చేశానని చెప్పడంతో, అయిష్టంగానే లోపలకు వెళ్లి ,బయటకొచ్చి, ఆదిత్యను పరుచూరి ఆలింగనం చేసుకుని అదిరిపోయింది అన్నాడు. ఫస్టాఫ్ లోని నీ స్నేహం పాటను క్లైమాక్స్ లో యాడ్ చేసేసరికి అదిరిపోయింది. 2001అక్టోబర్ 19న రిలీజ్ తో ఉదయ్ కిరణ్ కి హ్యాట్రిక్. ఆదిత్యకు డైరెక్టర్ గా మంచి గుర్తింపు. ఎం ఎస్ రాజు బ్యానర్ మళ్ళీ పుంజుకుంది. అంతలా ఎక్కడ చూసినా మనసంతా నువ్వే మారుమోగింది. ఈ మూవీ తర్వాత ఒక్కడు,వర్షం ఇలా పట్టిందల్లా ఎం ఎస్ రాజు నిర్మాతగా దూసుకుపోయాడు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u